Skip to main content
Latest News

ఖైరతాబాద్‌లో ఇద్దరు అనుమానాస్పద మృతి

ఖైరతాబాద్‌లోని సీబీఐ క్వార్టర్స్ లోని ఓ అపార్ట్‌మెంట్లో యువతి, యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వర్షశ్రీ అనే యువతి, మహేశ్వర్‌రెడ్డి అనే యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా ఆ ఇంట్లో రక్తం మరకలు, తీవ్రగాయాలతో యువతి పడిఉండగా… ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తును చేపడుతున్నారు.