Latest News

మైకుల హోరు, ప్రచార జోరుకు నేటితో ముగింపు:

గత కొన్ని రోజులుగా వీధుల్లోనూ, బస్తీల్లోను మారుమోగుతున్న మైకుల హోరు, ప్రచార జోరుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆగిపోనుంది. డిసెంబర్ 7 పోలింగ్ జరగనుండటం తో, నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాల్సిందే.  తెలంగాణా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్‌ జరుగుతుంది. 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  నియోజకవర్గాలకు కేటాయించాల్సిన ఈవీఎంలు, వీవీపీఏటీలను, ఈవీఎంలపై అతికించే బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయింది. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.