Skip to main content
Latest News

టీజర్‌ : తొలిప్రేమ

హీరో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్‌కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది.

టీజర్‌లో.. ‘మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం’ అని వరుణ్‌ బాధపడుతూ చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘తొలిప్రేమ..’ అంటూ సాగుతున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రియదర్శిని పులికొండ్ల, సుహాసిని మణిరత్నం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా ‘తొలిప్రేమ’ టైటిల్‌తో 1998లో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.