Skip to main content
Latest News

Vijay Sethupathi

సైరా సినిమాలో నటించిన.. విజయ్ సేతుపతికి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే..

కోలీవుడ్‌లో స్టార్ రేంజ్‌ను ఎంజాయ్ చేసే హీరోలు... తెలుగులోనూ తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది కోలీవుడ్ స్టార్స్ సక్సెస్ అయ్యారు కూడా. రజనీకాంత్, కమలహాసన్, సూర్య, కార్తీ, విక్రమ్...ఇలా చెప్పుకుంటే ఈ లిస్టు చాలా పెద్దదే. తాజాగా ఈ లిస్టులో చేరేందుకు కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన విజయ్ సేతుపతి కూడా ఎదురుచూస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులను తన యాక్టింగ్ టాలెంట్‌ను పరిచయం చేసేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురుచూసిన విజయ్ సేతుపతి... సైరా సినిమాలో వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పేశాడు.