Skip to main content
Latest News

Venu Madhav

వేణుమాధవ్ సొంత ఇంటికి వెరైటీ పేరు.. దానికో పెద్ద కథే ఉంది..!

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం చనిపోయారు. అయన మరణం పట్ల సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.. తెలుగు పరిశ్రమ మంచి నటుడుని కోల్పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. పలువురు సినీ రాజకీయ నాయకులను ఇమిటేట్ చేయడంతో ఆయనకి మిమిక్రి ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు లభించింది. టీడీపీ ఆఫీసులో రూ.600 జీతానికి పనిచేస్తూ.. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం వేణుమాధవ్ ట్రై చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించాయి.

వేణుమాధవ్ బతికుండగా తీసుకున్న చివరి ఫొటో.. రాజశేఖర్ వ్యాఖ్యలివీ..

హాస్య నటుడు వేణు మాధవ్ అకాల మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్‌కు కిడ్నీలు కూడా చెడిపోవడంతో సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కాగా వేణు మాధవ్‌తో ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితో ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

వేణుమాధవ్ మరణానికి అసలు కారణమేంటో చెప్పిన శివాజీ రాజా apnews Wed, 09/25/2019 - 16:18

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు వేణుమాధవ్ మృతిచెందినట్టు ఆయన సోదరుడు గోపాలకృష్ణ వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఉన్న ఇంటికి వేణుమాధవ్ మృతదేహాన్ని తీసుకువెళ్లారు. కాగా వేణుమాధవ్ మరణవార్త తెలిసిన మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.

వేణుమాధవ్‌ను ఎన్టీఆర్.. ఏమని పిలిచేవారో తెలుసా..?

తెలుగులో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న కమెడియన్ వేణు మాదవ్ ఇకలేరు. గత కొంత కాలంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈ నెల 6న యశోద ఆసుపత్రిలో చేర్పించారు.  అప్పటి నుంచి ఆయనకు డయాలసీస్ చేస్తూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది.. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు.  టాలీవుడ్‌లో వేణు మాధవ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన పుట్టింది నల్గొండ జిల్లా కోదాడ. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు.

అనారోగ్యంతో వేణుమాధవ్ కన్నుమూత.. 

ప్రముఖ సినీనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం 12.21 గంటలకు మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉత్తేజ్ కవిత.. లవ్యూ వేణూ అంటూ..

హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ప్రతిఒక్కరిని కలిచివేస్తుంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన బుధవారం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. గురువారం అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయన మరణం పట్ల తెలుగు సినీరాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయన మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటని చెబుతున్నారు. వేణుమాధవ్‌తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకొని విలపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నటుడు ఉత్తేజ్ వేణుమాధవ్‌తో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ తనకి మిమిక్రి ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటినుండి తెలుసునని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు.