Skip to main content
Latest News

Tdp vs Ysrcp

టీడీపీకి... వైసీపీని ఎదుర్కొనే శక్తి, నెట్ వర్క్ ఉన్నాయా?

ఇన్ని అరాచకాల తర్వాత కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న వైసీపీ నేతల ధైర్యాన్ని, మొండితనాన్ని చూసి ఏపీ జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు...భవిష్యత్తుపై తీవ్రమైన బెంగతో ఉన్నారు. వైసీపీలో ఉంటే జీవితం లేకుంటే నరకం అని భయభ్రాంతులకు గురిచేసే స్థాయిలో వైసీపీ నేతలు మాట్లాడటం సాధారణమైన విషయం కాదు.  వాస్తవానికి పల్నాడు అరాచకాలు దేశ వ్యాప్తంగా హైలైట్ కావడం, ఆ తర్వాత పడవ ప్రమాదం జరిగి సుమారు 30 మంది చనిపోవడం, ఆ తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకోవడం వంటి వరుస ఘోరాల తర్వాత కూడా వైసీపీలో ఏం భయం లేదు.