Skip to main content
Latest News

Andra Pradesh Boat Accident

‘ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బోటను బయటకు తీస్తా..’

గోదావరి బోటు ప్రమాదం జరిగి పదిరోజులు గడిచిపోతుంది. ఇంకా పదమూడు మంది అడ్రస్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.. ప్రమాద భారిన పడినవారు బోటులోనే చిక్కుకునే ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో దాన్ని బయటకు తీసేందుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు వెనక్కి వెళ్లాయి. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి తీసుకువచ్చే ప్రయత్నాలకు రహాదారి అడ్డుగా మారింది. దీంతో చేసేదేమీ లేక అధికారులు సహయక చర్యలను నిలిపి వేసిన పరిస్థితి నెలకోంది.

బోటులో ఉన్నది 73 మంది కాదా..? భయపెడుతున్న తాజా లెక్కలు..!

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద వారం రోజుల క్రితం బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆ ఘటన సంచలనంగా మారింది. రెండు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు ఈ బోటు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు? అన్నది ఇప్పుడు సందేహస్పందంగా మారింది. ప్రమాదం తర్వాత.. ఎంతమంది బోటులో ఉన్నారన్న విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే అధికారికంగా దీనికి ఎలాంటి జాబితా లేదు. అయితే అధికారులు 73 మంది ఉన్నట్టు చివరకు తేల్చారు. అందులో సురక్షితంగా 26 మంది బయటపడినట్టు చెప్పారు. ఆ ప్రకారం ఇప్పటికి 36 మృతదేహాలు బయటపడ్డాయి.

బోటును తీస్తే.. అదో చరిత్రే.. ఇంకా దొరకని 13 మంది ఆచూకీ..

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగి పెనువిషాదానికి కారణమైన బోటు ఆచూకీ ఎట్టకేలకు గుర్తించిన విషయం తెలిసిందే. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వందలాది మంది నాలుగు రోజులపాటు తీవ్రంగా శ్రమించి బోటు 315 అడుగుల లోతులో ఉందని గుర్తించారు. ఉత్తరాఖండ్‌ విపత్తు నిర్వహణ దళం తమ దగ్గరున్న అధునాతన సోనార్‌ వ్యవస్థ సాయంతో రెండు రోజులపాటు గాలించింది. బుధవారం బోటు ఆచూకీ కనిపెట్టగలిగింది. అయితే, దీని ఆచూకీ తేల్చడం కంటే బయటకు తీయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏపీలో ఘోరం.. 61 మందితో వెళ్తున్న బోటో బోల్తా..

గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 61 మందితో వెళ్తున్న బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచులూరు వద్ద 61 మందితో కూడిన బోటు మునిగిపోయింది. లైఫ్ జాకెట్లతో 14 సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణాలకు ఎదురొడ్డి ఈదుతూ వస్తున్న వీరిని తూటుగుంట గ్రామస్తులు కాపాడారు. మిగిలిన వారి కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. బోటు పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  పోలవరం గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. గోదావరిలో వరద తగ్గడంతో అధికారులు బోటు పర్యటనకు అనుమతి ఇచ్చారు. దీంతో పాపికొండలు పర్యటనకు వెళ్తుండగా.. వరద ఉధృతి ఒక్కసారిగా పెరిదంది.