Skip to main content
Latest News

Nresah

మళ్లీ ‘మా’లో రచ్చ.. నరేశ్‌కు రాజశేఖర్ షోకాజ్ నోటీసులు..!

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. యూనియన్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, అధ్యక్షుడు నరేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని హీరో రాజశేఖర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన నేతృత్వంలోని కొందరు కమిటీ సభ్యులు ఇప్పటికే నోటీసులపై సంతకాలు కూడా చేసినట్టు సమాచారం. ‘మా’ సంస్థకు సంబంధించిన కొన్ని పెండింగ్ సమస్యలు గురించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని మా కమిటీ భావిస్తున్నా ఆ విషయాలపై నరేశ్ ఆసక్తి కనపరచక పోవడం రాజశేఖర్‌కు అదే విధంగా మా కమిటీకి అసహనం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.