Skip to main content
Latest News

KTR

కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. గులాబీ పార్టీలో అసంతృప్తి గళం!

ఆదివారం కేసీఆర్ చేసిన కేబినెట్ విస్తరణ.. టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది.. మంత్రి పదవిని ఆశించి భంగపడిన నేతలు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడుతుండగా.. మరికొందరు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో అసంతృప్తి గళం వినిపించిన అధికార టీఆర్‌ఎస్‌ నేతలను బుజ్జగించే పని మొదలైంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ అనంతరం పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి ఏకంగా కేసీఆర్‌ మాట తప్పారని ఆరోపించగా.. జోగు రామన్న అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.