Skip to main content
Latest News

Syraa Narasimha Reddy

సైరా సినిమాలో నటించిన.. విజయ్ సేతుపతికి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే..

కోలీవుడ్‌లో స్టార్ రేంజ్‌ను ఎంజాయ్ చేసే హీరోలు... తెలుగులోనూ తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది కోలీవుడ్ స్టార్స్ సక్సెస్ అయ్యారు కూడా. రజనీకాంత్, కమలహాసన్, సూర్య, కార్తీ, విక్రమ్...ఇలా చెప్పుకుంటే ఈ లిస్టు చాలా పెద్దదే. తాజాగా ఈ లిస్టులో చేరేందుకు కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన విజయ్ సేతుపతి కూడా ఎదురుచూస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులను తన యాక్టింగ్ టాలెంట్‌ను పరిచయం చేసేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురుచూసిన విజయ్ సేతుపతి... సైరా సినిమాలో వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పేశాడు.

బాహుబలి, సాహో రికార్డులు అప్పుడే బ్రేక్ చేసిన సైరా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై హీరో రామ్‌చరణ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో  జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.