Skip to main content
Latest News

Kcr

మంత్రివర్గంలోకి కేటీఆర్.. కవితకు ప్రమోషన్.. హరీశ్‌కు మాత్రం నో ఛాన్స్..!

శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రమంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఒకటి లేదా రెండు దఫాల్లో దసరా నాటికి దీనిని చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి దఫా దసరా లోపు కాగా.. రెండో విడత సంక్రాంతి నాటికి చేపట్టవచ్చని తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు, ఆ తర్వాత బతుకమ్మ పండుగ ఉన్నాయి. ఇవన్నీ ముగిసిన తర్వాత కొత్త మంత్రులు వస్తారనే భావన టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. ముహూర్తాలు బాగుంటే, ఇతర పరిణామాలేమైనా ఉంటే దసరా కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎంతో కలిసి 12 మంది ఉన్నారు.

‘అమరావతి నిర్మాణం వేస్ట్.. చంద్రబాబుకు చెప్పినా విన్లేదు..’

ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం సరైంది కాదన్నారు. ఇంత భారీ మొత్తంలో నిధులను రాజధాని కోసం ఖర్చు పెట్టే బదులు.. రాయలసీమలో సాగునీటికి ఖర్చు పెడితే ఫలితం ఉంటుందని చంద్రబాబుకు చెప్పానన్నారు. కానీ చంద్రబాబు తన సలహాను పెడచెవిన పెట్టారని కేసీఆర్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. గులాబీ పార్టీలో అసంతృప్తి గళం!

ఆదివారం కేసీఆర్ చేసిన కేబినెట్ విస్తరణ.. టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది.. మంత్రి పదవిని ఆశించి భంగపడిన నేతలు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడుతుండగా.. మరికొందరు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో అసంతృప్తి గళం వినిపించిన అధికార టీఆర్‌ఎస్‌ నేతలను బుజ్జగించే పని మొదలైంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ అనంతరం పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి ఏకంగా కేసీఆర్‌ మాట తప్పారని ఆరోపించగా.. జోగు రామన్న అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయినా.. టీటీడీ బోర్డును ఏర్పాటు చేయడం లేదేంటనే ప్రశ్న తలెత్తింది. టీటీడీ చైర్మన్ నియామకం పూర్తయినా.. సభ్యుల నియాకం విషయమై ఇప్పటి వరకూ స్పందించకపోవడమే దీనికి కారణం. కాగా, బుధవారం నిర్వహించిన కేబినెట్ భేటీలో.. టీటీడీ పాలక మండలిలోని సభ్యుల సంఖ్యను 18 నుంచి 24కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్‌తో కలిపి ఈ సంఖ్య 25కి చేరుతుంది. త్వరలోనే బోర్డు సభ్యులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.