Skip to main content
Latest News

NTR

వేణుమాధవ్‌ను ఎన్టీఆర్.. ఏమని పిలిచేవారో తెలుసా..?

తెలుగులో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న కమెడియన్ వేణు మాదవ్ ఇకలేరు. గత కొంత కాలంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈ నెల 6న యశోద ఆసుపత్రిలో చేర్పించారు.  అప్పటి నుంచి ఆయనకు డయాలసీస్ చేస్తూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది.. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు.  టాలీవుడ్‌లో వేణు మాధవ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన పుట్టింది నల్గొండ జిల్లా కోదాడ. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు.

చివరి కోరిక తీరకుండానే.. కన్నుమూసిన వేణుమాధవ్..

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇకలేరు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వేణుమాధవ్ మరణంపై చంద్రబాబు స్పందించారు. టీడీపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ‘మిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్య నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మృతి విచారకరం. తెదేపా ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారు.