Skip to main content
Latest News

Karnataka, Upendra,Ys Jagan

జగన్ బాటలో ఉపేంద్ర.. బెంగళూరులో జాబ్ చేస్తున్న తెలుగువారికి షాక్

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పుడు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికా లాంటి అగ్ర దేశాలు సైతం స్థానిక మంత్రాన్నే జపిస్తున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు అన్న డిమాండ్ అన్ని దేశాల్లోనూ,రాష్ట్రాల్లోనూ పెరిగిపోతోంది. ఇటీవలే ఏపీ సీఎం జగన్ కూడా స్థానిక పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని నిర్ణయించి.. జీవోను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కొంత వ్యతిరేకత వస్తోంది. కేవలం ఏపీ వాసిని కానందున.. ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుబట్టింది. అయినప్పటికీ ఇదే నినాదాన్ని మరికొన్ని రాష్ట్రాలు, కొందరు నేతలు అందిపుచ్చుకుంటున్నారు.