Skip to main content
Latest News

తల్లి అంత్యక్రియలకు డబ్బుల్లేక.. రాత్రికి రాత్రే చెత్తకుప్పలో మృతదేహాన్ని పడేసి..

ఆతనో ఆలయ పూజారి.. చాలీచాలని ఆదాయంతో బతుకు బండిని లాగిస్తున్నాడు. వృద్దురాలైన తల్లి ఆతని వద్దే ఉంటోంది. ఇంతలో హఠాత్తుగా అనారోగ్యంతో తల్లి మృతి చెందింది.ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి అతడి వద్ద డబ్బులు లేవు. దిక్కుతోచని స్థితిలో గుండెని రాయి చేసుకుని తల్లి మృతదేహాన్ని చెత్తకుప్పలో వేశాడు. కనీసం అలా అయిన పారిశుద్ధ్య సిబ్బంది తీసుకుని వెళ్లి పాతిపెడతారని ఆ అభాగ్యుడు భావించాడు. హృదయవిదారకమైన ఈ సంఘటన తూత్తుక్కుడిలో చోటుచేసుకుంది. నారాయణ స్వామి కొన్ని సంవత్సరాల క్రితం చెన్నైకి వెళ్లి అక్కడ ఉన్న ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. వసంతి తన కుమారుడు ముత్తు లక్ష్మణన్‌ వద్ద ఉంటూ వచ్చింది. ముత్తు లక్ష్మణన్‌ ఆలయ పూజారిగా ఉన్నాడు. అంతంత మాత్రం ఆదాయంతో కఠిన పేదరికంలో నివశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో వసంతి అనారోగ్యంతో ఆదివారం రాత్రి హఠాత్తుగా మృతి చెందింది. 

తల్లికి అంత్యక్రియలు చెయ్యటానికి డబ్బులు లేకపోవడంతో ముత్తు లక్ష్మణన్‌ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఆ రాత్రికి రాత్రే.. తన తల్లి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ఇక ఉదయం చెత్త వేసేందుకు చెత్త కుండీ దగ్గరకు వెళ్లిన స్థానికులు.. వసంత మృతదేహాన్ని చెత్తకుండీలో గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఇక పోలీసుల విచారణలో కుమారుడు లక్ష్మణన్‌ తన తల్లి శవాన్ని చెప్పకుప్పలో పడేసినట్టు తేల్చారు. అయితే, అంత్యక్రియలకు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తల్లి డెడ్‌బాడీని చెత్త కుప్పలో వెల్లడించాడు లక్ష్మణన్‌. చెత్తకుండి పక్కన తల్లి మృతదేహం విసిరేస్తే కార్పొరేషన్‌ కార్మికులు తీసుకుని వెళ్లి పాతిపెడతారని భావించి తల్లి మృతదేహాన్ని అక్కడ విసిరేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు తూత్తుక్కుడి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి అతని కుమారుడికి అప్పగించారు. తర్వాత కొద్ది మంది దాతల సహాకారంతో అంత్యక్రియలు నిర్వహించాడు లక్ష్మణన్‌.

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News