Skip to main content
Latest News

ఎవరైనా చనిపోతే పెళ్లిని వాయిదా వేస్తారు.. కానీ ఈ యువకుడు మాత్రం..

ప్రయివేట్ స్కూళ్లో టీచర్‌గా పని చేసే ఓ యువకుడు తనతోపాటు టీచర్‌‌గా పని చేసే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతణ్ని ఇష్టపడింది. వీరిద్దరి ప్రేమకు ఇంట్లో వాళ్లు కూడా ఓకే చెప్పారు. సెప్టెంబర్లో పెళ్లి చేద్దామని నిర్ణయించారు. కానీ ఇంతలోనే ఆ యువకుడి తండ్రి అనారోగ్యం కారణంగా మరణించాడు. నాన్నంటే గుండెల నిండా ప్రేమ నింపుకొన్న ఆ యువకుడు.. తండ్రి సమక్షంలోనే తన పెళ్లి జరగాలని భావించాడు. నాన్న శవం ముందే ప్రేమించిన యువతిని పెళ్లాడాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా దిండివనం గ్రామానికి చెందిన అలగ్జాండర్‌ (30) ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జగదీశ్వరి(27)తో ని ప్రేమించిన అలెగ్జాండర్ తమ  ప్రేమ గురించి రెండు కుటుంబాలను ఒప్పించాడు.  సెప్టెంబరు 2వ తేదీ మైలం సుబ్రమణ్యస్వామి ఆలయంలో వారి వివాహాం ఖాయమైంది.

అంతా మంచే జరుగుతోందనుకున్న క్రమంలో.. అలెగ్జాండర్‌ తండ్రి దైవమణి అనారోగ్య కారణంగా పరిస్థితి విషమించి గతం శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.  దీంతో తండ్రి సమక్షంలోనే వివాహం జరగాలని నిర్ణయించుకున్న అలెగ్జాండర్.. తండ్రి భౌతికకాయం వద్దే తన వివాహం జరగాలని చెప్పాడు. అందుకు రెండు కుటుంబాలవారు అంగీకరించారు. తన ఇంటిలోనే వివాహ వేదికగా అలంకరించి, దైవ మణి మృతదేహానికి పట్టు వస్ర్తాలు కట్టించి, పక్కనే తల్లిని కూడా పట్టువస్ర్తాలతో ముస్తాబు చేశాడు. ఆ తర్వాత అలెగ్జాండర్‌ తనకు నిశ్చయమైన యువతి మెడలో తాళి కట్టాడు. శోకపూరిత వాతావారణంలో జరిగిన ఈ పెళ్ళికి ఇరువైపు బంధువులూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా.. వధూవరుల కుటుంబాల్లోనో, దగ్గరి బంధువుల్లో ఎవరైనా చనిపోతే శుభకార్యాన్ని వాయిదా వేస్తూ ఉండటం గురించి అందరికీ తెలిసిందే. కానీ విచిత్రంగా ఈ యువకుడు మాత్రం తండ్రి శవం ముందే పెళ్లి చేసుకోవడం వింతగా మారింది. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News