Skip to main content
Latest News

ఉచితంగా 4K టీవీ, సెట్‌టాప్ బాక్స్.. జియో ఫోన్-3.. రిలయన్స్ సరికొత్త సంచలనం

రిలయెన్స్ జియో గిగాఫైబర్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. గిగాఫైబర్‌ సేవల్ని పొందే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది రిలయెన్స్ జియో. గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి ఉచితంగా హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు. 'జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా పొందొచ్చు. గిగాఫైబర్ ప్లాన్స్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్ ధరలు ఉంటాయి. జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు.

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖేశ్ అంబానీ అధికారిక ప్రకటన చేశారు. జియో గిగాఫైబర్ ద్వారా అందించనున్న ల్యాండ్‌లైన్‌లో కేవలం రూ.500కే అన్‌లిమిటెడ్ ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చని ముఖేష్ అంబానీ అన్నారు. ప్రస్తుతం ఫిక్స్‌డ్ ల్యాండ్‌లైన్ కాల్స్‌కు ఇతర కంపెనీలు వసూలు చేస్తున్న చార్జిల కన్నా జియో గిగాఫైబర్ ల్యాండ్‌లైన్ చార్జిలు తక్కువగా ఉంటాయని తెలిపారు. అలాగే అమెరికాలో ప్రస్తుతం సగటు వినియోగదారుడికి అందుతున్న బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 90 ఎంబీపీఎస్ ఉందని, కానీ జియో ద్వారా భారత్‌లోని కస్టమర్లకు 100 ఎంబీపీఎస్ కనీస స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభిస్తాయని తెలిపారు. ఇక ఈ స్పీడ్‌ను గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు పెంచుతామన్నారు 

మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. సోమవారం ముంబయిలో జరిగిన రిలయల్న్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జియో ఫోన్‌3ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. గత ఏజీఎం మీటింగ్‌లో రూ.2,999 ధరతో జియో ఫోన్‌2ని ఆవిష్కరించామని, ఈసారి జియో ఫోన్‌ని ఆవిష్కరిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. దీని ధర రూ.4,500 ఉండొచ్చని తెలిపారు. మరికొద్ది రోజల్లోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.  4జీ స్మార్ట్‌ ఫీచర్లతో వస్తున్న జియో ఫోన్3ని మీడియా టెక్ చిప్‌సెట్‌తో తయారుచేశారు. గతంలో వచ్చిన జియో ఫోన్లకు క్వాల్కమ్, యూనిసాక్ చిప్‌సెట్‌లు వాడగా తాజా ఫోన్‌కు మాత్రం మీడియాటెక్ టెక్నాలజీ వాడారు. ఇది కాయ్(KAI) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో, జియో2 ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సాప్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. జియో3 ఫోన్‌లో వీటన్నింటినీ అప్‌డేట్ చేయడమే కాకుండా మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా అందించనున్నట్లు సమాచారం. 

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News