Skip to main content
Latest News

షావోమీ నుంచి అదిరిపోయే మోడల్.. కొత్త ఫీచర్లతో రెడ్‌మీ 8A

షావోమీ నుంచి మరో కొత్త ఫోన్ రెడ్ మీ 8ఏ మార్కెట్లోకి వచ్చేస్తోంది. రెడ్ మీ 8ఏ నేడు(సెప్టెంబర్ 25) భారత మార్కెట్లో లాంచ్ అయింది. బడ్జెట్ విభాగంలో వచ్చే ఏ సిరీస్‌లో భాగంగా గతంలో విడుదలైన రెడ్ మీ 7ఏకు తర్వాతి వెర్షన్ అయిన 8ఏ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. రెడ్ మీ 7ఏ ఈ సంవత్సరం జూలైలోనే విడుదలైంది. అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే షావోమి ఆ ఫోన్ కు అప్ డేట్ తెచ్చిందన్న మాట. 7ఏ కంటే అడ్వాన్స్‌డ్ వెర్షన్లతో షావోమి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని  ప్రారంభ ధర రూ. 6499.  3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌  ధర 6,999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ నెల 30 నుంచి  విక్రయానికి సిద్ధంగా ఉంది. దమ్‌దార్‌ రెడ్‌మి 8ఏలో వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం, టైప్‌ సీ చార్జర్‌ స్పెషల్‌ ఫీచర్‌ లాంటి ఎనిమిది దమ్‌దార్‌ ఫీచర్లున్నాయని అని కంపెనీ చెబుతోంది..

Read Also : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1.40 లక్షల ఉద్యోగాలు..!

 

రెడ్‌మీ 8 ఏ ఫీచర్లు:
6.22 ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1520×720  పిక్సెల్స్‌రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9పై  
19:9  రేషియే వాటర్‌డ్రాప్‌ నాచ్‌ కార్నింగ్‌గ్లాస్‌ 5
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 439 
2/3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ 
12 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో రెండు రకాల మోడల్స్ ఉండనున్నాయి. 12 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా గల డ్యూయల్ కెమెరా సెటప్ వెనకవైపు, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ముందు వైపు ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉండనుంది. దీని బరువు 190 గ్రాములుగా ఉండనుందని సమాచారం. డ్యూయల్ సిమ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. అంతే కాకుండా అదనంగా మైక్రో ఎస్ డీ కార్డు కూడా ఇందులో వేసుకోవచ్చు. బ్లాక్, బ్లూ, గ్రీన్, గ్రే, పింక్, పర్పుల్, రెడ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. Redmi 8A మోడల్‌కి సంబంధించి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంటుంది. Aura wave అనే సరికొత్త గ్రిప్‌ డిజైన్‌ లభించడం వల్ల ఫోన్‌ చేతిలో పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఫోన్‌ వెనుక భాగంలో ఉండే కెమెరాలు ప్రొఫెషనల్‌ DSLR కెమెరాల నాణ్యతతో తీయగలిగేలా ఉంటాయని Xiaomi తన ఈవెంట్‌ పేజీలో పేర్కొన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది..

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News

Tags