Skip to main content
Latest News

ముసలోళ్లే కదా.. బెదిరిపోతారనుకుని దొంగతనానికి వెళ్తే.. చుక్కలు చూపించారు

తమపై దాడికి దిగిన దుండగులకు వృద్ధ దంపతులు చుక్కలు చూపించారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయేలా చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కడయం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై వెనకగా వచ్చిన ఓ దుండగుడు..అతడికి ఉరి బిగించేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ భార్యను పిలిచాడు. ఇంతలో మరో ఆగంతకుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ మంకీ క్యాప్‌లు ధరించి ఉండటంతో.. గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది.
 
ఈ గందరగోళం పరిస్థితుల నేపథ్యంలో లోపలి నుంచి బయకు వచ్చిన పెద్దావిడ అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే తేరుకొని దుండగులపై చేతికి దొరికినదాన్ని విసరడం మొదలుపెట్టింది. దుండగుల దగ్గరున్న కత్తులకు ఏమాత్రం వెరవకుండా వృద్ధులిద్దరూ కుర్చీలతో దాడి చేశారు. ఒక్కసారిగా వృద్ధుల నుంచి ప్రతిఘటన ఎదురవ్వడంతో అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీల్లో రికార్డ్ అవ్వడంతో .. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వృద్ధదంపతులను ధైర్యాన్ని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో ఎంతో ధైర్యంగా ఆగంతకులను ఎదుర్కొన్న వృద్ధ దంపతులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తుల వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News