Skip to main content
Latest News

మియా ఖలీఫా.. పోర్న్ చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బెంతో తెలిస్తే..

మియా ఖలీఫా.. ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. పోర్న్ స్టార్‌గా తన వృత్తిని మానేసి నాలుగేళ్లు దాటినా.. ఆమె వీడియోలు మాత్రం ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్లే.. ప్రముఖ ప్రఖ్యాత పోర్న్ స్టార్ జాబితాలో ఆమె పేరు ఇప్పటికీ టాప్‌లోనే ఉంటుంది. మరి అంతటి ఖ్యాతి దక్కించుకున్న మియా ఖలీఫా.. పోర్న్ చిత్రాల ద్వారా ఎంత సంపాదించిందనుకుంటున్నారు..? వందల వేల కోట్లలోనే ఆమె సంపాదన ఉంటుందనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. పోర్న్ స్టార్‌గా తన సంపాదన కేవలం 8.5 లక్షల రూపాయలు మాత్రమేనని మియా ఖలీఫా తేల్చిచెప్పింది. కోట్లాది మంది అభిమానులకు ఊహించని షాకిచ్చింది. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఆమె పంచుకుంది. 

‘పోర్న్ ద్వారా నేను కోట్లు గడిస్తున్నానని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. పోర్న్ వీడియోల్లో నటించడం ద్వారా నేను సంపాదించింది కేవలం రూ.8.5లక్షలు మాత్రమే. పోర్న్‌కు గుడ్‌బై చెప్పాక దాని ద్వారా నాకు ఒక్క పైసా రాలేదు. పోర్న్‌కు గుడ్ బై చెప్పాక సాధారణ ఉద్యోగం వెతుక్కోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. 2015లో నీలి చిత్రాలకు గుడ్‌బై చెప్పా. పోర్న్‌ ఇండస్ట్రీలో నేను కొనసాగింది కొద్దిరోజులే.. కానీ నా వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చు లాగా వ్యాపించాయి. అందుకే నేను పోర్న్ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చినా.. నా వీడియోలు టాప్ ర్యాంకింగ్స్‌లో ఉంటున్నాయి. హిజాబ్ ధరించి పోర్న్‌లో నటించినందుకు ఐసిస్ నుంచి అప్పట్లో నాకు బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని దేశాలు నాపై నిషేధం విధించాయి. ఐసిస్ నన్ను చంపేస్తుందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను కేవలం 400మంది ఫాలోవర్స్‌తో ప్రారంభమయ్యాను. ఆ తర్వాత 3 రోజుల్లోనే 2లక్షల ఫాలోవర్స్ వచ్చారు. అప్పటినుంచి ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది.. 2 మిలియన్స్ దాటాకా.. ఆ సంఖ్య మరింతగా పెరిగింది. దాంతో నా ఇన్‌స్టాగ్రామ్‌ను ఐసిస్ హ్యాక్ చేసింది. ఇదంతా నేను పోర్న్ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చాక జరిగింది. పోర్న్‌కు గుడ్ బై చెప్పాక నేను పడ్డ కష్టాలను తలచుకుంటే భయమేస్తుంది. ఎవ్వరూ నాకు ఉద్యోగం ఇవ్వలేదు..’ అని మియా ఖలీఫా చెప్పుకొచ్చింది. 

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News