Skip to main content
Latest News

వారెవ్వా కానిస్టేబుల్.. దేశం యావత్తూ నీకు ఫిధా.. వీడియో వైరల్..

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమవుతోన్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఎయిర్‌ పోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అలా వెళ్లిన సిబ్బందికి వరదలో చిక్కుకోని ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు. నీళ్లల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా తన భుజాలపైకి ఎత్తుకుని.. వరదనీటిలో నడుచుకుంటూ గట్టుకు చేర్చారు. గుజరాత్‌లోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో ఆ కానిస్టేబుల్ నడుముల్లోతు నీటిలో ఇద్దరు చిన్నారులను భుజాలమీద కూర్చోబెట్టుకొని కాపాడారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించారు. 

ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. ఆ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన సీఎం.. ‘‘ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. వారి నిబద్ధతను అభినందించండి’’ అంటూ ట్వీట్ చేశారు. ఆయనపై సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. కాగా.. భారత పశ్చిమ తీరంలోని కేరళ నుంచి గుజరాత్ వరకు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్టల్ గార్డ్ బలగాలు.. అహర్నిశలు శ్రమిస్తూ వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మహరాష్ట్ర, గుజరాత్, కేరళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు వస్తుండటంతో అధికార యంత్రాంగం సహాయక కార్యక్రమాల్లో తలమునకలైంది. రెస్క్యూ టీం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వరద బాధితులను కాపాడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి..

 

 

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News