Skip to main content
Latest News

మన విక్రమ్ ల్యాండర్ సేఫ్.. ముక్కలవలేదంటూ ఇస్రో ప్రకటన

ఇది ఇస్రో శాస్త్రవేత్తలే కాదు.. భారతీయులంతా ఊపిరి పీల్చుకోతగ్గ వార్త. చందమామకు 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచీ చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్... ముక్కలైపోలేదనీ, అది సింగిల్ పీస్‌గా ఉందని ఇస్రో ప్రకటించింది. నిజానికి అంత ఎత్తు నుంచీ అంత పెద్ద ల్యాండర్ (ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27కేజీలు) పడితే... పగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ... చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి... అది పగిలిపోకుండా... ఉన్నది ఉన్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఇస్రో మరో శుభవార్త కూడా చెప్పింది. అంత ఎత్తు నుంచీ పడే ల్యాండర్... అటో ఇటో ఎటోకటు దొర్లుతూ వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ... విక్రమ్ ల్యాండర్ బుద్ధిగా ఎక్కడైతే పడింతో... అక్కడే అలాగే ఉందని వివరించారు ఇస్రోకి చెందిన ఓ అధికారి. పాటిజివ్ అంశాలు ఉండటం వల్ల ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు.

విక్రమ్ ల్యాండర్‌ లోపల ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉంది. అందువల్ల పైనుంచీ పడినప్పుడు ల్యాండర్ ముక్కలై ఉంటే... ఇక అది పనిచేసే అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ఇస్రో చెబుతున్నదాని ప్రకారం ల్యాండర్ క్షేమంగా ఉంది కాబ్టట్టి... దాన్ని నుంచీ సిగ్నల్స్ అందుకునే అవకాశాలున్నాయి. ఒక్కసారి ఆ సిగ్నల్స్ అందితే ఇక దాన్ని కావాల్సిన విధంగా సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. దాన్లోంచీ రోవర్‌ను బయటకు తెప్పించేందుకు కూడా వీలవుతుంది. అందువల్ల ఏం చేసైనా... ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. మరి ఇస్రో ప్రయత్నాలు ఎంత వరకు ప్రయత్నిస్తాయన్నది వేచిచూడాల్సిన అంశమే. కాగా.. విక్రమ్ ఒక పక్కకు ఒరిగి ఉండటంతో.. కమ్యునికేషన్‌ను పునురుద్ధరించేందుకు వీలుగా యాంటినాలు సరైన దిశలో ఉన్నాయా..? లేదా..? అనే అంశంపై ఇంకా సంగ్ధితత నెలకొంది. ల్యాండర్‌లోని విద్యుత్ వ్యవస్థపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. కమ్యునికేషన్‌ను పునరుద్ధరించేందుకు యాంటినాలు సరైన దిశలో ఉండటం తప్పనిసరి అని  ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు.

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News