Skip to main content
Latest News

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనుంది. ఈ సేల్ సందర్భంగా అమెజాన్ కొత్త లాంచ్‌లు, ఇప్పటి వరకు ఉన్న ఉత్పత్తులపై మునుపెన్నడూ లేని డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఈ సేల్ లో రూ.1 నుంచి ఉత్పత్తులు ప్రారంభం కానున్నట్లు అమెజాన్ అధికారిక పేజీలో తెలిపింది. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు మాత్రం ఈ సేల్ 12 గంటల ముందుగానే ప్రారంభం కానుంది. పండుగల సీజన్‌ సందర్భంగా ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు ఈ సేల్ ఉంటుందని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం కలిగినవారు సెప్టెంబర్‌ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఆఫర్లను అందుకోవచ్చు. భారత్‌లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈసారి ఆఫర్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు పూర్తిచేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వివరించింది.

ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్ యాక్సెసరీలపై కూడా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. హెడ్ ఫోన్స్ రూ.349 నుంచి, ఫిట్ నెస్ ట్రాకర్లు రూ.799 నుంచి మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్ లు రూ.199 నుంచి, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ యాక్సెసరీలు రూ.99 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ గ్రేట్ ఇండియన్ సేల్ లో టీవీలు, గృహ సంబంధిత ఎలక్ట్రానిక్ పరికరాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. టీవీలపై రూ.833 నుంచి, వాషింగ్ మెషీన్లపై రూ.695 నుంచి, రిఫ్రిజిరేటర్లపై రూ.959 నుంచి, ఏసీలపై రూ.1,299 నుంచి నో కాస్ట్ ఈఎంఐ ప్రారంభం కానుంది. గృహోపకరణాలు, టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్‌ ఉండనుంది. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ వంటి బ్రాండెడ్‌ ఉత్పత్తులు ఈ విభాగంలో ఉన్నట్లు తెలిపింది. టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ ప్రారంభ ధర రూ. 9,999 కాగా, స్ప్లిట్‌ ఏసీలపై 45 శాతం వరకు తగ్గింపు ఉందని ప్రకటించింది.

దుస్తులపై అమెజాన్ అద్భుతమైన ఆఫర్లు ఇస్తుందనే చెప్పాలి. అన్ని ఫ్యాషన్ ఆర్డర్లపై అమెజాన్ పే క్యాష్ బ్యాక్ రానుంది. అలాగే 1,200కు పైగా టాప్ బ్రాండ్లపై 70 శాతం వరకు డిస్కౌంట్, లక్షకు పైగా దుస్తులపై 40 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే బడ్జెట్ చూసుకుని కొనుగోలు చేసే వారి కోసం రూ.599 లోపు కూడా దుస్తులు ఉన్నాయి. ఈ సేల్ లో కిరాణా సామగ్రి రూ.1 నుంచే ప్రారంభం కానున్నాయి. 30 వేలకు పైగా రోజువారీ ఉత్పత్తులపై అత్యంత భారీ తగ్గింపు లభించనుంది. 55 వేలకు పైగా అమెజాన్ కూపన్లు అందుబాటులో ఉన్నాయి. సబ్ స్క్రైబ్, సేవ్ చేసుకున్నవారికి అదనంగా 20 శాతం తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా 50 వేలకు గృహ, వంట సామగ్రిపై 80 శాతం వరకు తగ్గింపు లభించనుంది. వంట గదికి సంబంధించిన ఉత్పత్తులు రూ.99 నుంచి ప్రారంభం కానున్నాయి. టాప్ బ్రాండ్లకు చెందిన 5 లక్షలకు పైగా ఉత్పత్తులు సగం కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. 

అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తొ పాటు, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కూడా ఈ తేదీల్లోనే ఉంది. కాబట్టి కొనుగోలు చేయాలనుకునే వారు ఆఫర్లను బట్టి కాకుండా అవసరాన్ని బట్టి కొనుగోలు చేసి తమ జేబుకు చిల్లు పడకుండా చూసుకుంటే మంచిది. ప్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా చాలా తెలివిగా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడే రోజుల్లోనే ఈ గ్రేట్ ఇండియన్ సేల్, బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభించాయి. కాబట్టి ముందూ, వెనకా చూడకుండా కొనుగోలు చేస్తే మిగతా నెలంతా ఇబ్బంది పడటం తప్పదు మరి!

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News