Skip to main content
Latest News

వెండి పతంగుల పండుగ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పతంగుల పండుగ అంబరాన్నంటుతోంది. ఎటు చూసినా పతంగులే కనిపిస్తున్నాయి. పిల్లలైతే హుషారుగా గాలి పటాలను ఎగురవేస్తున్నారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషన్ కైట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక నగరానికి చెందిన ఆనంద్ రెడ్డి.. వెండితో గాలి పటాన్ని తయారు చేశాడు. 0.5 గ్రాముల వెండితో గాలిపటాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. ఆనంద్‌రెడ్డి గాలి పటాల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడికి వచ్చిన వారంతా వెండి గాలి పటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంగు రంగుల గాలి పటాలను గాల్లోకి ఎగురవేస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు.