Latest News

సవ్యసాచి మూవీ రివ్యూ

నాగ చైతన్య ప్రేమ కథా చిత్రాలతో మంచి హిట్స్ సాధించాడు.  అప్పుడప్పుదు యాక్షన్ చిత్రాల్లో ట్రై చేసినా అంత విజయం సాధించలేదు.  ఇప్పుడు చందు మొండేటి దర్సకత్వంలో సవ్యసాచి తో మరో యాక్షన్ మూవీ తో మన ముందుకు వచ్చారు.  కార్తికేయ తో హిట్ కొట్టిన చందు మొన్దేటి సవ్యసాచితో మళ్ళీ హిట్ కొట్టారా?  నాగచైతన్యకు యాక్షన్ కలిసి వచ్చిందా? 

వానిషింగ్ సిండ్రోమ్ ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కిన సవ్యసాచి ఎలావుందో చూద్దామా...

 

స్టొరీ:

 

కథానాయకుడు విక్రం ఆదిత్య (నాగ చైతన్య) వానిషింగ్ సిండ్రోమ్ తో పుట్టిన వ్యక్త్రి.  ఇతను ఎక్కువ సంతోషం కలిగినా, భావోద్వేగాలు కలిగినా ఎక్కువగా స్పందిస్తూ వుంటాడు.  ఒకరిలోనే ఇద్దరు వున్నారు కాబట్టి తల్లి విక్రంగా, ఆదిత్యగా పిలుస్తూ వుంటుంది.  ఇతోనో AD ఫిలిం డైరెక్టర్.   చిత్ర (నిధి అగర్వాల్) ని ప్రేమిస్తాడు.  ఇద్దరు దగ్గరయ్యే క్రమంలో దూరం అవుతారు. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత కలుస్తారు.  ఆరేళ్ళ తరవాత కలిసిన విక్రం ఆదిత్య, ప్రియ ఆనందంగా వున్నా సమయంలోని విక్రం ఒక ad ఫిలిం పని మీద న్యూ యార్క్ వెళ్లి వచేసరికి అక్క శ్రీదేవి (భూమిక) ఇంట్లో బాంబు పేలుతుంది.  విక్రం బావ చనిపోతాడు.  ప్రమాదం జరిగాక అక్క హాస్పిటల్ లో వుంటుంది.  విక్రం కి ఎంతో ఇష్టం ఐన అక్క కూతరు చనిపోలేదని తన దగ్గరే వుందని ఒక అజ్ఞాత వ్యక్తి (మాధవన్) ఫోన్ చేసి చెబుతాడు.  ఆ బాంబు పేలుడు వెనుక ఎవరున్నారు?  కిడ్నాప్ ఐన అక్క కూతురుని ఎలా కాపాడాడు?  ఎడమచేతిలో వున్నా ఆదిత్య ఎలా కాపాడాడు?  ఇవన్ని తెలుసుకోవాలంటే వెండితెరఫై చూడాల్సిందే.

 

ప్రదర్సనలు:

నాగచైతన్య విక్రంగా, ఆదిత్యగా పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు.  రొమాంటిక్ సీన్స్ లో, కామెడీ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో చాల బాగా చేసాడు చైతు.  పవర్ఫుల్ సైకో విలన్ గా మాధవన్ పెర్ఫార్మన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.  అక్కగా భూమిక, హీరోయిన్ గా నిధి అగర్వాల్ పాత్రలమేరకు నటించారు.   కీరవాణి సంగీతం లో టైటిల్ సాంగ్ మినహా మిగతా పాటలు అంత వినసొంపుగా లేవు.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 

 

 

పాజిటివ్స్:

వైవిధ్యమైన కథ

నాగ చైతన్య, మాధవన్ పెర్ఫార్మన్స్

క్లైమాక్స్ సన్నివేశాలు

కొన్ని కామెడీ సీన్స్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు.

యువరాజ్ ఫోటోగ్రఫీ.

 

ప్రతికూలతలు:

వినోదాత్మకంగా లేని ప్రథమార్థం.

రక్తి కట్టని హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్.

 

రేటింగ్:

2.5/5.