Latest News

కొ'దంగల్' లో రేవంత్ విజయం? పోలీసులపై ఆగ్రహించిన హైకోర్ట్

కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థి, తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయడంపై హైకోర్ట్ తీవ్ర అభ్యంతరం తెలియచేసింది. రేవంత్ రెడ్డిని ఈ తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ పై వేం నరేందర్ రెడ్డి హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.. దీన్ని విచారణ కు స్వీకరించిన హైకోర్ట్ రేవంత్‌ బందుకు పిలుపునిస్తే తప్పేంటని.. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్నినియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. ఇంటలిజెన్స్ సమాచారం మేరకే తాము రేవంత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలపగా.. ఆధారాలు సమర్పించాలని హైకోర్ట్ పోలీసులను ఆదేశించగా, కాపీ లేదని పోలీసులు చెప్పినట్టు సమాచారం. విచారణ ప్రారంభమైన తర్వాత పోలీసులు రేవంత్ రెడ్డిని ఈ సాయంత్రం విడుదల చేస్తామని తెలిపారు. అతన్ని విడుదల చేసినంత మాత్రాన అక్రమ అరెస్ట్ ను సక్రమ అరెస్ట్ గా మార్చలేమనీ, విచారణకు అడ్వొకేట్‌ జనరల్‌ హాజరుకావాలని ఆదేశించింది.