Latest News

రాంచరణ్-కియరాల వినయ విదేయ రామ - లిరికల్ సాంగ్

మెగా పవర్ స్టార్ రాం చరణ్-కియార అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘వినయ విధేయ రామ’. బోయపాటి  మార్క్ యాక్షన్-ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు.  దేవి-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సంగీత పరంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  తాజాగా ఈ చిత్రం ఇప్పటికే అంచనాలు పెరిగాయి.  వినయ విదేయ రాం ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో ‘‘తందానే తందానే’’ అనే ఫ్యామిలీ సాంగ్‌ ను విడుదల చేసారు.  అభిమానులు కోరుకునే అన్ని హంగులతో వినయ విదేయ రామ, రాంచరణ్ కియరా అద్వాని తో కలిసి మన ముందుకు సంక్రాంతికి రావడానికి ముస్తాబవుతున్నాడు.