Latest News

రజనీకాంత్ శంకర్ ల రోబోటిక్ మేనియా: 4 రోజుల్లో 40౦ కోట్లు కొల్ల గొట్టిన రోబో 2.0

ప్రపంచ స్థాయి లో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరో గా, బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన విజువల్ వండర్  రోబో 2.0 బాక్స్ఆఫీస్ దగ్గర కలెక్షన్లను కొల్ల గొడుతోంది.  ఇటీవల విడుదలైన ఈ సినిమా పిల్లలని, పెద్దవారిని అమితంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ల నటనకు, అద్భుతమైన గ్రాఫిక్స్ తోడై చిత్రాన్ని మరో రేంజ్ కి తీసుకెళ్ళాయి.  విడుదలైన తొలి రోజే ఈ చిత్రం రూ.100 కోట్ల కు పైగా వసూలు చేసిందని తమిళ చిత్ర వర్గాలు తెలిపాయి.  విడుదల ఐన 4 రోజుల్లోనే రూ. 400 కోట్ల మార్క్ ను దాటిందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా తెలిపింది.  ముఖ్యంగా ౩ D లో కూడా విడుదలైన ఈ చిత్రం చిన్నారులను బాగా ఆకట్టుకుంటోంది.. విడుదల ఐన 4 రోజుల్లో ఈ చిత్రం హిందీ వర్షన్ 95 కోట్లను, తెలుగు లో 52 కోట్లను, తమిళ్ లో రూ. 60 కోట్లను వసూలు చేసింది.  అన్ని భాషల్లో కలుపుకుని రూ. 400 కోట్లను దాటింది.. అమెరికాలో టాప్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ విజేత గా నిలిచింది.