Latest News

రాజమౌళి వారసుడి సినిమాకి ఎం ఎం కీరవాణి తనయుడి ట్యూన్స్

ఆకాశవాణి తీమ్ పోస్టర్ విడుదల:  

 

రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ “షాయింగ్ బిజినెస్” అనే నిర్మాణ సంస్థ ను స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.  ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు తొలిసారి దర్శకత్వం వహిస్తుండగా..ఎం ఎం కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం సమకూర్చడం విశేషం.  సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి మాటలను అందిస్తున్నారు.  దీన్ని ఒక పీరియడ్ ఫిలిం గా కొత్త కాన్సెప్ట్ తో నిర్మిస్తారు.    చిత్రం షూటింగ్ జనవరి 2019 లో మొదలవుతుంది.  “నా ఇద్దరు పిల్లలు నిర్మాత గా, సంగీత దర్శకుడి గా పరిచయం కావడం చాల సంతోషాన్నిస్తుందని” రాజ మౌళి ట్వీట్ చేసారు.   

Image removed.