Skip to main content
Latest News

ఏంటీ పనులు.. లారెన్స్ ఆగ్రహం.. ఫ్యాన్స్‌కు విన్నపం

‘ఏంటీ ఈ పనులు.. మీకు ఏమైనా అయితే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి.. ఇలాంటి పనులు చేసేముందు ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి.. నా మీద అభిమానం ఉండొచ్చు.. కానీ ఇలాంటి పనులు నాకు నచ్చవు.. నేను ప్రోత్సహించను.. మరోసారి ఇలాంటి పనులకు ఎవరూ పూనుకోవద్దు.. నా అభిమానులు ఎవరికైనా పేదలకు సాయం చేసి చెప్తే.. నేను ఎంతగానో ఆనందిస్తా.. అంతకుమించి నాకు ఏమీ వద్దు..’ అంటూ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల కాంచన-3 సినిమా విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.. హర్రర్ కామెడీలో కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తున్నారంటూ లారెన్స్‌పై పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని చేసిన అరుదైన ఫీట్.. లారెన్స్‌కు కోపం తెప్పించింది.. 

భారీ క్రేన్ సహాయంతో తన చేతుల మీదుగా లారెన్స్ కటౌట్‌కి పూలమాల వేసి పాలాభిషేకం చేశాడో అభిమాని.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో కాస్తా లారెన్స్ దృష్టిలో పడింది.. అంతే.. ఆ వీడియోపై లారెన్స్ స్పందించాడు.. ఇలాంటి అభిమానాలు తనకు నచ్చవంటూ తేల్చిచెప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘ఫ్యాన్స్‌కు, ఫ్రెండ్స్‌కు నా విన్నపం. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ థియేటర్ ముందున్న నా బ్యానర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియోను ఇప్పుడే చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధనిపించింది. దయచేసి ఇలాంటి రిస్కీ ఫీట్లు చేయొద్దు. మీ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి.. నాపై ఉన్న ప్రేమను చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పనులు చేసేముందు ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వారున్నారన్న సంగతిని గుర్తు తెచ్చుకోండి.. ఇలాంటి పనులకు బదులు పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి, ఫీజులు కట్టలేని వారికి ఫీజులు కట్టండి, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు అన్నం పెట్టండి. ఆ వీడియోలను నాకు పంపండి.. వాటిని చూస్తే నాకు ఎక్కడా లేని ఆనందం కలుగుతుంది. నా ఫ్యాన్స్ కూడా నలుగరికి సాయం చేస్తున్నారన్న తృప్తి ఉంటుంది.. రిస్కీ ఫీట్లు చేస్తూ ప్రాణాలకు తెగిస్తున్న ఇలాంటి ఘటనలు మరోసారి చేయొద్దని కోరుతున్నా. మీ జీవితం ఎంతో విలువైంది.. దాన్ని గుర్తు పెట్టుకోండి’’ అని లారెన్స్‌ తన సందేశంలో పేర్కొన్నారు.