Skip to main content
Latest News

ఎవరా సుమతి..? చివరిసారి కోడెల ఆమెకు ఎందుకు కాల్ చేశారు..?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య మిస్టరీలో అనేక కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల ఉరివేసుకోవడం వల్ల మృతిచెందినట్టు పోస్టు మార్టంరిపోర్టు స్పష్టం చేస్తున్నప్పటికీ.. ఆయన మరణం వెనుక ఇంకా మిస్టరీ అలాగే ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలా..? రాజకీయ వేధింపులా..? చనిపోయే ముందు ఆఖరు సారి ఎవరికి కాల్ చేశారు..? అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు. వీటిలో కోడెల ఆఖరుసారి ఎవరికి కాల్ చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు 24నిమిషాలు ఓ వ్యక్తితో మాట్లాడిన కోడెల.. ఆ తర్వాత బసవతారకం హెచ్ఆర్ హెడ్ సుమతికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. సుమతి బసవతారకం హాస్పత్రి నెలకొల్పినప్పటినుండి హెచ్ఆర్ విభాగంలో పని చేస్తున్నట్టు బసవతారకం సిబ్బంది చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా బసవతారకంలో ఏంజరుగుతుందో తెలుసుకోవాలంటే బసవ తారకం హాస్పటల్ ఛైర్మన్, హీరో బాలకృష్ణ కూడా సుమతికే ఫోన్ చేసి సమాచారం తెప్పించుకోవడం సర్వసాధారణమైన అంశమని తెలుస్తోంది. దీంతో ఆమెతో చివరి క్షణంలో ఏం మాట్లాడారనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఆత్మహత్యకు ముందు అసలు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?అనే అంశాలు దర్యాప్తులో కీలకం కానున్నాయి. కోడెల ఫోన్ లభ్యమైతే ఈ అంశం పై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కోడెల ఫోన్‌లో కాల్ రికార్డర్ ఉంటే అసలు మొత్తం అంశంపై స్పష్టత ఉంటుందనే చర్చ జరుగుతోంది. కోడెల ఆత్మహత్య చేసుకున్న తర్వాత గదిలోకి ముందుగా వెళ్లిన కూతురు విజయలక్ష్మికి తండ్రి ఉపయోగించే మొబైల్ ఫోన్‌పై అవగాహన ఉండే అవకాశం ఉంది. కోడెల చనిపోయిన రోజున సాయంత్రం 5గంటలకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తోంది. అంతవరకు ఆయన కాల్ హిస్టరీని ఎవరైనా పరిశీలించారా అన్నది కూడా ఆసక్తిరేపుతోంది. అయితే చివరి సారిగా 24నిమాషాల పాటు మాట్లాడిన అవతలి వ్యక్తి ఎవరో తెలిసినా, తర్వాత హెచ్ ఆర్ సుమతికి కాల్ చేసి కోడెల ఏం చెప్పారో తెలిసినా కోడెల మరణం వెనక ఉన్న మిస్టరీ కొంతవరకైనా వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా.. కోడెల మృతిచెందిన సమయానికి ఆయన గృహంలో సెక్యూరిటీ సిబ్బందితో కలిపి ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల శివప్రసాద్ ఉపయోగించే మొబైల్ ఫోన్ అదృశ్యం కావడం, ఆయన గదిలో ఉన్న బీపి, శుగర్ ట్యాబ్లెట్స్ రేపర్స్ కింద పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కోడెల డ్రైవర్, గన్ మెన్, కూతురు విజయ లక్ష్మి, భార్య ఆ సమయంలో అక్కడే, అదే ఇంట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే ఎవరి గదుల్లో వారున్నట్టు సమాచారం. ఐతే కోడెల శివ ప్రసాద రావు ఉపయోగించే ప్రధాన మైన మొబైల్ ఫోన్ కనిపించడంలేదనే వార్త ఆందోళన కలిగిస్తోంది. చనిపోయే ముందు ఆయన 24నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లడారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే 24నిమిషాలు మాట్లాడిన అవతలి వ్యక్తి ఎవరనే అంశం పై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. 24నిమిషాల పాటు అత్యంత సన్నిహితులతో గాని, స్నేహితులతో గాని మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. ఇతర వారితో మాట్లాడితే అంత ఉదయాన్నే అంత మొబైల్ కాలక్షేపం చేసే ఆవశ్యకత ఉండదు. అత్యంత దగ్గరి వ్యక్తులు మాత్రమే అంతసేపు మాట్లాడే వెసులుబాటు ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఆత్మహత్య చేసుకోవడానికి చాలా సేపు సమాలోచనలు చేసుకున్నట్టు తెలుస్తోంది. చివరికి ఉరివేసుకుని చనిపోవాలనుకున్న కోడెల తన లుంగీ అంచును సన్నగా చించి ప్రయత్నించి నట్టు తెలుస్తోంది. తర్వాత గదిలో ఉన్న కేబుల్ వైర్‌ను మెడకు, ఫ్యాన్‌కు తగిలించుకుని తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online