Skip to main content
Latest News

టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేత.. సడన్‌గా తెల్లవారుజామున వచ్చి.. షాకింగ్ ట్విస్ట్

ఏపీలో కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దాడులు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు పగ తీర్చుకుంటున్నారు. విచక్షణా రహితంగా దాడులు చెయ్యటమే కాదు అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నాయకుల ఇళ్ళను, పార్టీ కార్యాలయాలను కూల్చివేయటంలో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారు. టీడీపీ నేతలే టార్గెట్‌గా ప్రభుత్వం రెచ్చిపోతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించిన 24 గంటల్లోనే.. నెల్లూరులో ఘోరం జరిగింది. టీడీపీ నేతలకు సంబంధించిన మూడు ఇళ్లను అధికారులు కూల్చేశారు. తెల్లవారు జామున సడన్‌గా వచ్చి.. అక్రమ నిర్మాణమంటూ ఆ భవనాన్ని నేలమట్టం చేసే పనులను ప్రారంభించారు.

నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని జనార్దన్‌ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చి వేస్తున్నారు.  పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం తెల్లవారుజాము నుంచి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ మేరకు కూల్చివేతను అడ్డుకుంటూ ధర్నా నిర్వహించారు. టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితమే నిర్మాణాల కూల్చివేతకు రెవెన్యూ అధికారులు రాగా.. భాధితుల అభ్యంతరాలతో వెనుదిరిగారు. ఈ తెల్లవారుజామునే మళ్లీ వచ్చి పని కానిచ్చేస్తున్నారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online