Skip to main content
Latest News

కర్ణాటక సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు.. ఈరోజే తేల్చేయండంటూ..

కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. గురువారం సాయంత్రం 6 గంటల్లోపు ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. గురువారం ఉదయం 11 గంటలకు పిటిషన్‌ విచారణకు వచ్చింది. స్పీకర్‌ ముందు హాజరై రాజీనామా విషయాన్ని ఆయనతో చర్చించాలని పేర్కొంది. కావాలనుకుంటే మళ్లీ రాజీనామాలు సమర్పించవచ్చునని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై రేపటిలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలందరూ బెంగళూరుకు చేరుకునేందుకు తగినంత భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీకి సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆ లేఖలను స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో అందించారు. రాజీనామా లేఖలు పరిశీలించిన స్పీకర్ రమేష్ కుమార్ ఐదు మంది రాజీనామా లేఖలు చట్టబద్దంగా ఉన్నాయని, 8 మంది రాజీనామాలు చట్టబద్దంగా లేవని స్పష్టం చేశారు. తాము చట్టబద్దంగా రాజీనామాలు చేసినా స్పీకర్ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని, తమ రాజీనామాలు అంగీకరించడం లేదని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల అర్జీని విచారణ చేసిన సుప్రీం కోర్టు గురువారం సాయంత్రం 6 గంటల లోపు మీరు స్పీకర్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని స్టార్ హోటల్ లో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరడానికి సిద్దం అయ్యారు. గురువారం సాయంత్రం 6 గంటలలోపు స్పీకర్ ముందు హాజరై తాము ఎందుకు రాజీనామా లుచేశామో వివరణ ఇస్తామని రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు హెచ్. విశ్వనాథ్ ముంబైలో మీడియాకు చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేల వివరణ ఇచ్చిన తరువాత స్పీకర్ రమేష్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. 13 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, బుదవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ, నాగరాజ్, డాక్టర్ కె. సుధాకర్ వారి పదవులకు రాజీనామా చేశారు