Skip to main content
Latest News

జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ రియాక్షన్

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాపాకకు ఆయన మద్దతుగా నిలిచారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ మలికిపురం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి... ఆస్తులని ధ్వంసం చేశారంటూ రాపాకతో పాటు.. ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో రాపాక వరప్రసాద్ రాజోలు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు కూడా. ఆయనతో పాటు మరో 15మందిని రాజోల్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల తరపున రాపాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారన్నారు. అలా వెళ్లిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసులు పెట్టడం సరికాదన్నారు.. ప్రజలు కోరిన తర్వాతే... వారికి మద్దతుగా జనసేన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారన్నారు. ఆ మాత్రానికి రాపాకపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు.

ఎమ్మెల్యే రాపాకపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదని పవన్ అన్నారు. ఈ విషయంపై గోటితో పోయే దానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారని ఆయన ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలు సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన క్యాడర్, నేతలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఘటనపై పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని తెలిపిన పవన్.. పరిస్థితులు అదుపుతప్పితే తానే రాజోలు వచ్చి అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. నెల్లూరులో ఓ జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మాత్రం మలికిపురం ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online