Skip to main content
Latest News

అమ్మానాన్నకు.. అరుదైన ఫొటోతో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన లోకేశ్

సరిగ్గా 38 ఏళ్ల క్రితం.. ఇదే రోజు (సెప్టెంబర్ 10న) నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి.. వివాహం జరిగింది. 1981వ సంవత్సరం సెప్టెంబర్ 10న ఉదయం 8గంటల 6 సెకన్లకు మద్రాసులో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అప్పటికే చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండటం, ఎన్టీఆర్ కూడా సినీ హీరో అవ్వడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు.. ఆ వివాహ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాజాగా నేడు చంద్రబాబు పెళ్లి రోజని తెలిసి.. అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే కోవలో.. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా.. తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

సహధర్మచారిణి అనే పదానికి అమ్మ నిలువెత్తు నిదర్శనం అన్నారు. అమ్మానాన్నలు ఆదర్శ దంపతులంటూ కొనియాడారు. ‘‘ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విదేశాలకు వెళ్లిన సందర్భంలో.. సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దిగిన  ఓ అరుదైన ఫొటోను లోకేశ్ షేర్ చేశారు. ఆయన ట్వీట్ కింద.. అభిమానులు కూడా చంద్రబాబుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలు పెడుతున్నారు. 

అమ్మానాన్నకు.. అరుదైన ఫొటోతో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన లోకేశ్

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online