Skip to main content
Latest News

లింగమనేనికి ఆర్కే కౌంటర్.. నేడు ఆధారాలతో బాంబు పేల్చుతారట..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో.. చంద్రబాబు నివాసం ఉంటున్న తన ఇంటిని కూల్చివేస్తారన్న ప్రచారం.. గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలపై లేఖలో స్పందించారు. తన ఇంటి దగ్గర సీఆర్డీఏ అధికారులు చేస్తున్న హడావుడితో ఆందోళన చెందుతున్నాను అన్నారు. చంద్రబాబుకు ఇంటిని అద్దెకు ఇచ్చినందుకు.. తనను ఆయన బినామీగా ప్రస్తావించడం ఆవేదన కలిగించిందన్నారు. మరోవైపు లింగమనేని రమేష్ రాసిన లేఖకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. 

లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు ఒక్క అనుమతి కూడా లేదని.. లింగమనేని రమేష్‌, చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. లింగమనేని రమేష్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. బహిరంగ చర్చ ఎక్కడ ఏర్పాటు చేసినా సిద్ధమన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తానని.. ప్రజలు, మీడియా ప్రతినిధుల ముందు ఆధారాలతో వాస్తవాలను బయట పెడతానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరి ఆర్కే సవాల్‌కు టీడీపీ నేతలు, లింగమనేని రమేష్‌లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. కాగా.. బుధవారం నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో ఆళ్ల.. ఎలాంటి ఆధారాలను బయటపెడతారోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంది. మొదటి నుంచి చంద్రబాబు ఇల్లుతోపాటు కరకట్టపై ఉన్న భవనాలు, ప్రజావేదిక వంటి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఆర్కే నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి బుధవారం ప్రెస్‌మీట్‌లో ఏమేం విషయాలు బయటపెడతారో.. ఆర్కే కౌంటర్లకు.. టీడీపీ నేతలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో వేచిచూడాలి. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online