Skip to main content
Latest News

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్.. 

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీసులకు లొంగిపోయారు. అనుచరులో కలిసి ఆయన రాజోలో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రాపాక వరప్రసాద్‌తో పాటు.. మరో 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని జనసేన ఎమ్మెల్యేతో పాటు...ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. రాపాక ఆయన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినట్లు కేసు నమోదైంది. దీంతో రాపాకను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

మలికిపురంలో ఆదివారం పేకాడుతున్న 9 మందిని ఎస్‌ఐ కేవీ రామారావు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితులను విడిచిపెట్టాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో పాటు అతని అనుచరుడు గెడ్డం తులసి భాస్కర్‌ ఎస్‌ఐతో ఘర్షణ పడడమే కాకుండా, సుమారు 100 మందితో కలిసి పోలీస్‌స్టేషన్‌పైకి రాళ్ళు రువ్వి స్టేషన్‌ కిటికీ అద్దాలు పగులగొట్టారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదయింది. దీంతో రాపాకను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మొదట చింతలమోరిలోని ఎమ్మెల్యే రాపాక ఇంటికి జీపులో వెళ్ళిన పోలీసులు.. ఇంట్లో ఎమ్మెల్యే లేకపోవడంతో వెనుదిరిగారు. ఎమ్మెల్యే అనుచరుల ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో..  వారు వెంటనే కస్టడీలోకి లొంగిపోవాలని ఇంటిసభ్యులను హెచ్చరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాపాక వరప్రసాద్ తన అనుచరులతో కలిసి రాజోలు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online