Skip to main content
Latest News

సీఎం వైఎస్‌ జగన్‌ మరో సంచలన నిర్ణయం..

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 7 లక్షలు పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యలపై స్పందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా గురువారం నుచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏఏ అంశాలపై చర్చించాలన్న దానిపై బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి సీఎం జగన్‌, మంత్రి బుగ్గన, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 

బీఏసీ సమావేశంలో వైసీపీ నుండి అనేక అంశాల మీద చర్చ కోసం ప్రతిపాదన చేసారు. విత్తనాల సమస్య, రాజధాని అంశం, కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు, ప్రాజెక్టులు, శాంతి భద్రతలు, కేంద్ర సాయం, రాజధాని, కరువు, రాష్ట్రంలో జరిగిన అవినీతి, రైతు సంక్షేమం వంటి వాటి పైన చర్చ సాగాలని వైసీపీ కోరింది. మొత్తం 14 రోజుల పాటు సమావేశం జరగాలని నిర్ణయించటం అన్ని సమస్యలను చర్చిద్దామని.. ప్రభుత్వం నుండి కీలక బిల్లులు సైతం ఉన్నాయని మంత్రులు వివరించారు. గురువారం అసెంబ్లీలో కరవుపై చర్చించాలని టీడీపీ కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 12న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలోనూ బీఏసీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశమైంది. ఇదే విధంగా 10వ తేదీ నుండి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

మరిన్ని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి!