Skip to main content
Latest News

కేసీఆర్ బాటలో జగన్.. మరో పథకానికి శ్రీకారం..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకాన్ని ఏపీలో కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికి కంటి వెలుగు పథకం ద్వారా ఉచిత నేత్ర చికిత్సలు అందించనున్నారు. ఏ మేరకు ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంటి వలుగు పథకాన్ని 5 దశల్లో అమలు చేస్తారు.. పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ల్ ఛైర్మన్‌గా టాన్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.

Read Also : చంద్రబాబుకు మద్దతుగా.. జగన్‌కు కేంద్ర మంత్రి ఘాటు లేఖ..

ఈ కంటి వెలుగు పథకాన్ని తొలి రెండు దశల్లో స్కూల్‌ విద్యార్థులకు అమలు చేస్తారు. తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటిబేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. కంటి వెలుగుకు సంబంధించిన సామగ్రి, పరికరాలు, మందుల్ని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కంటి వెలుగు పరీక్షల నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కంటి వెలుగు పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందిస్తుంది. ఈ పథకాన్ని మెదక్ జిల్లా మల్కాపూర్ లో 2018 ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున కేసీఆర్ ప్రారంభించారు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మాత్రం అక్టోబరు 10 నుంచి ఈ పథకం ప్రారంభించనుంది. అక్టోబర్ 10 నుండి 16వ తేదీ వరకు కంటి పరీక్షలు జరుగుతాయని, తర్వాత ఆరు దశల్లో కంటిచూపు లోపం గుర్తించిన వారందరికీ ఆధునిక వైద్యపరీక్షలు, అవసరమైన శస్త్ర చికిత్సలు, మందులు, కళ్ళజోళ్ళు ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. అక్టోబరు 10వ తేదీ నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online