Skip to main content
Latest News

చంద్రబాబు హౌస్ అరెస్ట్.. గుంటూరు జిల్లాలో 144 సెక్షన్.. 

ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో.. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలు తలెత్తడంతో.. పోలీసులు ముందు జాగ్రత్తగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్నారు. ఆత్మకూరుకు వెళ్లకుండా తనను, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇంట్లోనే చంద్రబాబు 12 గంటల నిరాహార దీక్షను మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపి పిలుపు నిచ్చిన ఛలో అత్మకూరును పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన తనయడు, నారా లోకేష్‌ను కూడా పోలీసులు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం బయట అడ్డుకున్నారు. దీంతో నారా లోకేష్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని అక్రమ అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్న నేతల్ని ఆరుబయటే అరెస్ట్ చేసి అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి అచ్చం నాయుడు, దేవినేని అవినాష్‌, తదితర నేతలను చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో బ్లాక్‌ డేగా అభివర్ణించారు. శాంతియుత నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బాధితులకు సంఘీభావంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు ఏపీ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ‘చలో ఆత్మకూరు’ ఎఫెక్ట్‌తో పల్నాడుతోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నానిని అరెస్ట్ చేసిన పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online