Skip to main content
Latest News

ఆగస్టు 15 వేడుకలు ముగిసిన వెంటనే.. ఫ్యామిలీతో సహా సీఎం జగన్.. ఎక్కడికి వెళ్తున్నారంటే..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఇటీవలే జెరూసలేం పర్యటనకు వెళ్లొచ్చిన వైఎస్ జగన్… తాజాగా.. పదిరోజుల అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్‌ వెళ్తారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరతారు. సీఎం చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. 17న డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. భారీస్థాయిలో ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక అమెరికాలో తెలుగువారి కోసం పనిచేస్తున్న పలు సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ చాలా కాలంగా స్థిరపడిన తెలుగువారు పెద్దసంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా తెలిపింది. సీఎం హోదాలో మొదటిసారి ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ సమావేశంలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించనున్నారు. తిరిగి ఈ నెల 24న అమరావతి చేరుకుంటారు సీఎం జగన్. అలాగే అమెరికాలోని డెట్రాయిట్‌లో ‘డెట్రాయిల్ తెలుగు అసోసియేషన్’ ఏర్పాటు చేసి 40 వసంతాలు పూర్తయింది. ఆ కార్యక్రమానికి కూడా జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కాజరుకానుంది. ఈ అమెరికా పర్యటన సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణంపై జగన్ పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

మర్రిని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 
Telugu News Online