Skip to main content
Latest News

రోజాకు ప్రమోషన్.. కీలక పదవినిస్తూ ఉత్తర్వులు జారీ

ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినేట్‌లో తనకు చోటు దక్కకపోవడంతో ఆమె కినుక వహించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. పలు సమీకరణల కారణంగా మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నానని కీలక పదవిని అప్పగిస్తామని సీఎం జగన్‌ ఆమెకు హామీ ఇచ్చారు ఆ మేరకు ఆమెను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రోజా పార్టీ తరపున వాయిస్ బాగా వినిపించారు.. టీడీపీ సర్కార్‌పై పోరాటాలూ చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణాలతో రోజాకు పదవి దక్కలేదు. దీంతో ఆమె కొంత అసంతృప్తికి గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ అధిష్టానం రోజాను బుజ్జగించింది. ఆ వెంటనే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి దక్కింది. 

నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పదవి అయితే దక్కింది కానీ.. ఆమె మాత్రం బాధ్యతలు స్వీకరించలేదు. రోజా అలకబూనారా అంటూ ప్రచారం కూడా జరిగింది. అమరావతికి రావడం మానేశారట.. సొంత నియోజకవర్గానికి మొన్నటి వరకు దూరంగా ఉన్నారు. కేవలం హైదరాబాద్‌‌కే పరిమితమయ్యారనే చర్చ నడిచింది. గతంలోనే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించిన విషయం వాస్తవమే. కానీ అధికారికంగా ఉత్తర్వులు మాత్రం రాలేదు. కొన్ని కారణాలతో.. ఉత్తర్వులు రావడం ఆలస్యమయ్యిందట. అందుకే రోజా కూడా బాధ్యతలు స్వీకరించలేదని క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఫిషియల్‌గా పదవి రావడంతో.. ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 

మరిన్ని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి!