Latest News

నాగ్ నానిల మల్టీ స్టారర్

అది 11 ఏళ్ళ క్రితం వచ్చిన జానీ గద్దార్ అనే మూవీ. పూర్తి క్రైమ్ థ్రిల్లర్ తరహాలో రూపొందిన ఆ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి నాగ్ నాని ఇమేజ్ లకు కొత్తగా రాసుకున్నారని  తెలుస్తోంది. ఇది అఫీషియల్ గా బయట పడే న్యూస్ కానప్పటికీ విశ్వసనీయ సమాచారం మేరకు నిజమే అని టాక్. 

న్యాచురల్ స్టార్ నాని మొదటిసారి చేస్తున్న మల్టీ స్టారర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అశ్విని దత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదొక బాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకుని కథ రాసుకున్నట్టుగా ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది.

కధ:

మాఫియా డాన్ అయిన ధర్మేంద్రకు ఒక డ్రగ్ డీల్ వస్తుంది. అతని ముఠాలోని సభ్యుడే నీల్ నితీష్. ఇతను కాకుండా మరో నలుగురు ఉంటారు. ఆ డీల్ కోసం వాళ్లకు 5 కోట్లు అవసరం పడతాయి. లాభం అంతకు రెట్టింపు వస్తుందని ఆశించి ఒక్కొక్కరు 50 లక్షలు వేసుకుని ముఠాలోని ఒకడిని ముంబై నుంచి గోవాకు పంపిస్తారు. కానీ దురుద్దేశంతో ఉన్న ఆ గ్యాంగ్ మెంబెర్ అక్కడికి చేరుకోకుండా డబ్బుతో ఉడాయిస్తాడు.

కానీ ఆ డబ్బుని దొంగతనం చేయడానికి నీల్ నితీష్ స్కెచ్ వేస్తాడు. ఇక కథ అక్కడి నుంచి ఊహించని మలుపులు తిరుగుతుంది. ధర్మేంద్ర పాత్ర నాగ్ అని నీల్ నితీష్ పాత్ర నాని అని తాజాగా వినిపిస్తున్న అప్ డేట్. ఇది నిజమని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు కనక పుకారు గానే తీసుకోవచ్చు. కానీ కథ అయితే థ్రిల్లింగ్ గా ఉంది. షూటింగ్ టైంలోనే నాగ్ పాత్ర డాన్ తరహాలో ఉంటుంది అనే లీక్ వచ్చింది. నానిని మాత్రం డాక్టర్ అన్నారు.