Skip to main content
Latest News

మంచి మనసు చాటుకున్న విజయ్.. టీమ్ సభ్యులకు 400 బంగారు ఉంగరాలు

ఈ మ‌ధ్య స్టార్ హీరోలు ఇండ‌స్ట్రీలో కొత్త సంప్ర‌దాయాన్ని తీసుకొచ్చారు. త‌మ‌కి మంచి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికో లేదంటే క‌లిసి పని చేసిన టీం మెంబ‌ర్స్‌కో బ‌హుమ‌తులు ఇస్తున్నారు. తాజాగా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న టీం మెంబ‌ర్స్ కి బిగిల్ పేరుతో రాసి ఉన్న బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా అందించాడు. విజ‌య్ త‌న పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవ‌డంతో టీం అంద‌రికి దీపావ‌ళి కానుక‌గా గోల్డెన్ రింగ్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చాడు. విజ‌య్ హీరోగా అట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో బిగిల్ సినిమా రూపొందుతుంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. 

తెరి, మెర్సల్‌ వంటి హిట్‌ సినిమాల తర్వాత యువ డైరెక్టర్‌ అట్లీ- విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. కాగా బిగిల్‌ అంటే విజిల్‌ అని అర్థం. ఇంతవరకు విడుదల చేసిన పోస్టర్లలో విజయ్‌ లుక్స్‌ చూస్తుంటే అతడి క్యారెక్టర్‌లో మూడు నాలుగు షేడ్స్‌ ఉంటాయని అర్థం అవుతోంది. వాటి ప్రకారం విజయ్‌ ఒక గెటప్‌లో యంగ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్‌ లుక్‌లో కనిపించాడు. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News