Skip to main content
Latest News

మరో రెండ్రోజుల్లో ఉన్మాదం.. అంటూ ‘వాల్మికి’ టీజర్ గురించి ట్వీట్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్యాంగ్ స్టర్ పాత్రలో వరుణ్‌తేజ్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫస్ట్‌లుక్ టీజర్‌లో వరుణ్ కిల్లింగ్ లుక్‌ను చూసి సినీ ప్రియులు షాకయ్యారు. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలను భారీగా పెంచారు. ఈ సినిమాను సెప్టెంబర్ 13న చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల కోసం వరుణ్ తేజ్ తీపి కబురు అందించారు. 

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్‌ లుక్‌లో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతో ఆకట్టుకోగా స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ‘‘మరో రెండు రోజుల్లో ఉన్మాదం మొదలైపోతుంది. ‘వాల్మీకి’ టీజర్ కోసం వేచి చూస్తూ ఉండండి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా.. మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారట. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. మరి ఆగస్టు 15న విడుదల కానున్న టీజర్‌లో వరుణ్ తేజ్ ఏమేం స్పెషల్స్ అందిస్తాడో చూడాల్సి ఉంది. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News