Skip to main content
Latest News

వేణుమాధవ్ మరణానికి అసలు కారణమేంటో చెప్పిన శివాజీ రాజా

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు వేణుమాధవ్ మృతిచెందినట్టు ఆయన సోదరుడు గోపాలకృష్ణ వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఉన్న ఇంటికి వేణుమాధవ్ మృతదేహాన్ని తీసుకువెళ్లారు. కాగా వేణుమాధవ్ మరణవార్త తెలిసిన మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వేణుమాధవ్ తనకు, అలీకి, ఉత్తేజ్‌కు ఆప్తమిత్రుడని అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. వేణుమాధవ్ గురించి ఆయన.. మీడియాతో ప్రత్యేకంగా శివాజీరాజా మాట్లాడారు..

Read Also : ప్రియాంక చోప్రా: నా తండ్రి నీడ (నిక్)ను పెళ్లి చేసుకున్నాను!

 

‘సినీ పరిశ్రమలోకి రాకముందు నుంచి నాకు, అలీకి వేణుమాధవ్ తెలుసు. అతను మిమిక్రీ చేసేవాడు. వేణుమాధవ్ తొలి సినిమాతోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. వేణుమాధవ్ లొకేషన్‌లో ఉంటే అందరితో సరదాగా మాట్లాడేవాడు. అనతికాలంలోనే మంచి ఆర్టిస్టుగా, మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పేదవాళ్లకు ఎంతో సాయం చేశాడు. అలాంటి వ్యక్తి లేకపోవడం మాకు, సినీ పరిశ్రమకు తీరనిలోటన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర వేణుమాధవ్ పార్థీవ దేహాన్ని ఉంచుతాం. సినీ నటులతోపాటు అభిమానులంతా ఆయన్ని చివరిచూపు చూడొచ్చు. వేణు గొప్ప మానవతావాది. ఎంతో మందికి సహాయం చేశాడు. వేణుమాధవ్ కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉంటాయి. పేదవాళ్లకు పంచిపెట్టేవాడు. ‘మా’ అసోషియేషన్‌లో నాతో కలిసి వేణు పనిచేశాడు.. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళదామని చెప్పినా రానన్నాడు. చివరకు అదే అతడిని చావుదాకా తీసుకొచ్చింది. ఆరోగ్యం మరింత విషమించడంతో బలవంతంగా తీసుకువచ్చాం. ట్రీట్‌మెంట్ అందించినా.. ఆయన్ను కాపాడుకోలేకపోయాం..’ అని శివాజీరాజా ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News