Skip to main content
Latest News

జబర్దస్త్‌కు రోజా గుడ్‌బై..!

నటిగా, పొలిటీషన్‌గా, జడ్జీగా, యాంకర్‌గా తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో రోజా గడిపేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఏ ఇబ్బంది రాలేదు. ప్రస్తుతం రోజాకు అధికార వైసీపీ పార్టీలో కొన్ని కీలక బాధ్యతలను అప్పగించారు. వైసీపీలోని సీనియర్ నేతల్లో రోజా ఒకరు. ఆమె రెండవసారి వరుసగా గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రోజాను ఏపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఏపీ సీఎం జగన్ నియమించారు. దీనితో ఇప్పుడు పార్టీలో రోజా పాత్ర ఎక్కువైంది. మరి ఇలాంటి టైంలో రోజా జబర్దస్త్‌కి టైం ఇవ్వగలుగుతారా..? అని అందరిలోనూ ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇన్ని రోజులు ఎలాగున్నా, ఇప్పుడు రోజా జబర్దస్త్‌లో ఉంటే, టీడీపీతో సహా విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. దానితో రోజా జబర్దస్త్‌కు గుడ్‌బై చెబుతారన్న టాక్ జోరుగా నడుస్తోంది. 

ఒకప్పుడు జబర్దస్త్ షోలో ఎంట్రీ డాన్స్ చేసే రోజా.. ఇప్పుడు అది మానేశారు. దానికి కారణం కూడా ఆమెపై పెరిగిన బాధ్యతలతోపాటు హోదా కూడా ఉండటంతో.. కాస్త హుందాగా ప్రవర్తించాలనుకోవడమే. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు ఆమె బాధ్యతలు కూడా పెరిగిపోయాయి. ఆ బాధ్యతలు తీర్చేందుకు టైమ్ కూడా ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది. అందుకే జబర్దస్త్ షో నుంచి తప్పుకునే యోచనలో రోజా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. ఆ మధ్య రెండు నెలలు రోజా తప్పుకోవడంతో ఆ స్థానంలో మీనా, సంఘవి లాంటి పాత హీరోయిన్స్‌ను తీసుకొచ్చి ట్రై చేశారు. కానీ అవంత ఆకట్టుకోలేదు. ఏది ఏమైనా.. జబర్దస్త్ స్టేజీపై రోజా, నాగబాబు కాంబినేషన్ ఉంటే ఆ లుక్కే వేరు. మరి రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. వేచి చూడాలి. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News