Skip to main content
Latest News

A సర్టిఫికెట్ బొమ్మ చూపిస్తానంటున్న రకుల్ ప్రీత్ సింగ్

ఆ అమ్మాయి పేరు అవంతిక. ఇంట్లో చాలా పద్ధతిగా ఉంటుంది. చల్లగాలిలా హాయిగా మాట్లాడుతుంది. పెద్దవాళ్లంటే అమితమైన గౌరవం. ఇక భక్తికి కొదవ లేదు. ఇదంతా ఇంటి వరకే. బయటకు వస్తే మాత్రం ఆ చల్లగాలి కాస్తా తుపానుగా మారిపోతుంది. అగరొత్తులు వెలిగించిన అమ్మాయి.. సిగరెట్టు ముట్టించి గుప్పు గుప్పుమంటుంది. చూడ్డానికి ‘యూ’ సర్టిఫికెట్‌. లోపలంతా పక్కా ‘ఏ’ సర్టిఫికెట్‌ బొమ్మ... ఇంతకీ అవంతిక ఎవరనుకుంటున్నారా..? రాహూల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ సినిమాలోని రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర పేరు.. ప్రస్తుతం మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. 

దీనిలో భాగంగా చిత్రంలోని రకుల్ ప్రీతి సింగ్ పాత్రను తాజాగా పరిచయం చేసింది. ఈ మేరకు చిన్న టీజర్‌ను వదిలారు. సినిమాలో రకుల్ పేరు అవంతిక. ఈ అమ్మాయిని చూసిన లక్ష్మి.. ‘అవంతిక పేరే ఎంత వినసొంపుగా ఉంది. అంతే పద్ధతి గల అమ్మాయి’ అని చాలా ఇష్టపడుతుంది. కానీ, వాస్తవానికి అవంతిక అంత పద్ధతి గల అమ్మాయేంకాదు. అల్లరి పిల్ల. మొదట ‘యు’ సర్టిఫికెట్ ప్రయోగిస్తుంది. పనికాకపోతే ‘ఎ’ సర్టిఫికెట్ చూపిస్తుంది. అంతటి గడసరి. అలాంటి పిల్ల గురించి ‘ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది సర్’ అని నాగార్జునతో వెన్నెల కిషోర్ అంటాడు. వెంటనే నాగార్జున ‘బొంగేంకాదు’ అని తీసిపారేస్తాడు. మొత్తం మీద ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. అవంతిక పాత్ర సినిమాకే హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ‘ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిల్యూర్‌లు తట్టుకోలేవు’ అని నాగార్జునతో రకుల్ అనగానే ఆయన హావభావాలు భలే ఉన్నాయి.