Skip to main content
Latest News

‘నన్ను పెళ్లాడతానని మోసం చేశావ్.. నా రూ.4 కోట్లు నాకిచ్చెయ్..’

మర్యాదగా నాకు నాలుగు రోజుల్లో.. రూ.4 కోట్లు ఇవ్వు.. లేదంటే నీ జీవితాన్ని నాశనం చేస్తా చూడు.. ఇదేదో సినిమాలో డైలాగులా ఉంది.. విలన్, హీరోయిన్‌ని ఇలానే కదా బెదిరిస్తాడు అనుకుంటున్నారా.. ఇది రీల్ లైఫ్‌లో కాదు.. రియల్ లైఫ్‌లో జరిగిన ఓ షాకింగ్ సంఘటన.. అసలు ఏం జరిగిందంటే.. బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఇటీవలే సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్త యూకే వెళ్లిపోయాడని, తనకు వీసా రావడమే ఆలస్యం.. రెక్కలు కట్టుకుని ఎగిరిపోతానని ఇటీవలే చెప్పింది రాఖీ.. ఆమె పెళ్లి చేసుకుంది అనే వార్త తెలియగానే.. షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు బాలీవుడ్ బాబులు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.. కట్ చేస్తే రాఖీ పాలిట విలన్‌లా ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు.. 

రాఖీ సావంత్‌ రహస్యంగా వివాహం చేసుకోవడంపై ఆమె మాజీ ప్రియుడు దీపక్‌ ఖలాల్‌ షాక్‌ అయ్యారు. దీపక్‌తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను వివాహం చేసుకోవడం లేదని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం రాఖీ ఓ ఎన్నారైను రహస్యంగా వివాహం చేసుకుని, ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశారు. ఈ నేపథ్యంలో రాఖీ తనను మోసం చేసిందంటూ దీపక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు నాలుగు రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించారు. అయితే దీపక్‌ వ్యాఖ్యల్ని రాఖీ ఖండించారు. ‘నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. నా భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు’ అంటూ ఆమె వరుస వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News