Skip to main content
Latest News

సర్‌ప్రైజ్.. షాకింగ్.. విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్‌ సినిమా..

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో మూవీ షురూ అయ్యింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఈ విషయంపై తాజాగా తన సోషల్ మీడియాలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు పూరీ. ‘ఇది అధికారికం. పూరీ జగన్నాథ్ తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం..’ అంటూ నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ సోమవారం ప్రకటించింది. క్రేజీ కాంబినేషన్‌లో మీ ముందుకు సినిమా రాబోతోందంటూ.. పూరీ, విజయ్‌, ఛార్మి కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. 

డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ, లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటం నిజంగా సర్‌ప్రైజింగ్‌గా ఉందని, దీన్ని ఊహించలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. టెంపర్ తర్వాత పూరీ చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మంచి హిట్‌ అందుకున్నారు. విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’తో జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. భరత్‌ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషించారు. దీని తర్వాత తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై తెరకెక్కిస్తున్న ‘హీరో’లో విజయ్‌ నటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల షూటింగ్‌ జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా చిత్ర బృందం స్పందించలేదు.

మర్రిని సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News