Skip to main content
Latest News

మెగాస్టార్‌ చిరు మెచ్చుకున్నారన్న ప్రభాస్.. రాజమౌళి గురించి అడిగిన విలేకరులు

ప్రభాస్ హీరోగా చేస్తున్న యాక్షన్ మూవీ సాహో సినిమా ట్రైలర్ శనివారం రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ రిలీజ్ తరువాత అంచనాలు భారీగా పెరిగాయి. ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను యూనిట్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్‌తో పాటు, హీరోయిన్ శ్రద్దా కపూర్, నిర్మాత ప్రమోద్, దర్శకుడు సుజిత్ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రభాస్, శ్రద్దా కపూర్ సమాధానాలు చెప్పారు.  ప్రభాస్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పొగుడుతూ ట్వీట్ చేసే రాజమౌళి, సాహో ట్రైలర్ రిలీజ్ తరువాత మాత్రం ట్వీట్ చేయలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు అడగ్గా.. రాజమౌళి ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారని అన్నారు.

‘రాజమౌళికి ట్రైలర్ చాలా నచ్చింది, సంతోషపడ్డారు. చిరంజీవి గారు ఫోన్‌ చేశారు. నేను షాక్‌ అయ్యా. నాకు ఒళ్లుగగుర్పొడిచింది. ముందు మెసేజ్‌ చేశారు. తర్వాత నేను ఫోన్‌ చేశా. అది గొప్ప ఫీలింగ్‌. ట్రైలర్ బాగా నచ్చిందన్నారు. మెగాస్టార్‌తో మాట్లాడటం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ‘బాహుబలి 1’ ముందే సుజీత్‌ నాకు ఈ కథ చెప్పాడు. అప్పుడే నాకు ‘బాహుబలి’ కథ మొత్తం తెలుసు. కానీ ఆ సినిమా అంత పెద్ద హిట్‌ అవుతుంది అనుకోలేదు. కానీ... ‘సాహో’ స్క్రీన్‌ప్లే మాత్రం గొప్పగా ఉండాలని ముందే ప్లాన్ చేసుకున్నాం. ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా హిట్‌ అయ్యింది. అలా ఇది ఇంకా పెద్ద యాక్షన్‌ చిత్రంగా మారింది. షూటింగ్‌లో తొలిరోజు చాలా కష్టమైన సీన్ షూట్‌ చేశాం. అలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించడం అంత సులభమైన పనికాదు. అయినప్పటికీ సుజీత్‌ చాలా తెలివిగా తీశాడు. అప్పుడు నాకు అతడిపై నమ్మకం కలిగింది. ఈ ప్రాజెక్టు అతడు చేయగలడు అనిపించింది...’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. 

మర్రిని సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News